హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎన్ఎస్యూఐ ఆందోళన నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డిగ్రీ, పీజీ పరీక్షల ఫీజులను వెంటనే మాఫీ చేయాలంటూ అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. ఈ నెల 10 లోపు డిగ్రీ పరీక్ష ఫీజు 16 వందల రూపాయలు, పీజీకి నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలని అన్నారు. పీజీ ఫీజు 23 వందల నుంచి 4 వేల అరు వందల రూపాయలు పెంచడం దారుణమని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు.
పరీక్ష ఫీజులు తగ్గించాలంటూ ఎన్ఎస్యూఐ ధర్నా - అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఎన్ఎఎస్యూఐ ధర్నా
డిగ్రీ, పీజీ పరీక్ష ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ... ఎన్ఎస్యూఐ హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ... ట్యాంక్‌బండ్‌పై ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు.
పరీక్ష ఫీజులు తగ్గించాలంటూ ఎన్ఎస్యూఐ ధర్నా
లాక్డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యార్థులు పరీక్ష ఫీజులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.