హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బూట్లు పాలిష్ చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. భాజపా సర్కార్ యువతకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగులకు బ్యాంకుల్లో డబ్బులు జమ చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు దండుకుని మోసం చేశారన్నారు.
ఎన్ఎస్యూఐ నిరసన
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఎన్ఎస్యూఐ నేతలు విమర్శించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు.
బూట్లు పాలిష్ చేస్తూ నిరసన