కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో పరీక్షలు పెడతారో లేదో అన్న అయోమయంలో విద్యార్థులు ఉన్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనాతో ఉద్యోగులు రావడం లేదని... ఈ పరిస్థితిలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
పరీక్షలు నిర్వహించవద్దని హెచ్‌ఆర్సీలో ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్ - ఎన్‌ఎస్‌యూఐ వార్తలు
రాష్ట్రంలో పరీక్షలు పెడతారో లేదో అన్న అయోమయంలో విద్యార్థులు ఉన్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
NSUI
కరోనా మహమ్మరి వల్ల విద్యార్థులు చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పేరుతో పేద, ధనిక విద్యార్థుల మధ్య వత్యాసాలు చూపిస్తూ... అందరికి సమాన విద్యా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఇదీ చదవండి:ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!