ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారినపడే ప్రమాదం ఉందని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు దిగివచ్చి ప్రవేశ పరీక్షలు వాయిదా వేసే వరకు తమ దీక్ష కొనసాగుతుందని బలమూరి వెంకట్ స్పష్టం చేశారు.
పరీక్షలు వాయిదా వేసే వరకు దీక్ష కొనసాగుతుంది: ఎన్ఎస్‌యూఐ - పరీక్షలు వాయిదా వేసే వరకు దీక్ష కొనసాగుతుంది: ఎన్ఎస్‌యూఐ
ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో.. గాంధీభవన్‌లో చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది. తమ డిమాండ్ నెరవేరేవరకు తమ దీక్ష కొనసాగుతుందని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ స్పష్టం చేశారు.
పరీక్షలు వాయిదా వేసే వరకు దీక్ష కొనసాగుతుంది: ఎన్ఎస్‌యూఐ
ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ దీక్షలో పాల్గొన్న సుమారు 20 మందికి ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించారు.
Last Updated : Aug 28, 2020, 6:48 PM IST