NSUI activists tried to storm the assembly: రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించారు.
ఎన్నిక-*ల్లో హామీ ఇచ్చిన విధంగా కేజీ టు పీజీ ఉచిత విద్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని ఇప్పటికైనా విడుదల చేసి ప్రతి ఒక్క నిరుద్యోగిని ఆదుకోవాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని వెల్లడించారు. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.