తెలంగాణ

telangana

ETV Bharat / state

Honey Beekeeping: ఎన్నారై గెలుపు మంత్రాలు... తేనెటీగల పెంపకంలో అద్భుత ఫలితాలు.. - తేనెటీగల పెంపకం

రాష్ట్రంలోను ఉద్యాన పంటలకు అబంధంగా... తేనెటీగల పెంపకానికి అపారమైన అవకాశాలు ఉండటంతో రైతులు, యువత ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు తేనెటీగల పెంపకం చేపట్టి.... తేనె ఉత్పత్తి చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఓ బ్రాండ్ సృష్టించి సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ యువత, మహిళలు, రైతులకు.... తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు.

nri-women-successful-in-honey-beekeeping
nri-women-successful-in-honey-beekeeping

By

Published : Aug 21, 2021, 4:25 AM IST

ఉద్యానపంటలకు అనుబంధంగా తేనెటీగల పెంపకంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. జీవవైవిధ్యం పరిరక్షణలో కీలక పాత్ర పోషించే తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు... తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలో నేషనల్ బీకీపింగ్ అండ్ హానీ మిషన్ పథకం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఉద్యాన శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కొందరు ఔత్సాహికులు తేనెటీగల పెంపకంలో.... చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన ఇందిరారెడ్డి... తేనెటీగల పెంపకంలో నిమగ్నమయ్యారు. రుతికా ఇన్నోవేషన్స్ పేరిట ఓ అంకుర కేంద్రం నెలకొల్పి.... సంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో పంట క్షేత్రాల్లో తేనెటీగలు పెంచుతున్నారు. నిమ్మ, బత్తాయి తోటల్లో పెట్టెల్లో తేనెటీగల పెంపకం చేపట్టి తేనె ఉత్పత్తి చేస్తున్నారు.

ఒక్క బాక్స్​లోనే 4 కిలోల నూనె..

తేనెటీగల పెంపకంతో రైతుల ఆదాయం రావడంతోపాటు... ఉద్యాన తోటల్లో పరపరాగ సంపర్కంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ఫలితంగా దిగుబడులు పెరుగుతాయి. చిన్న, సన్నకారు రైతులు తమ క్షేత్రాల్లో 50 నుంచి 100 పెట్టెలు ఏర్పాటు చేసుకుంటే.... జూన్, జులై మినహా మిగతా సమయాల్లో 9 నుంచి 10 నెలలపాటు ఒక్కో బాక్స్ నుంచి 2 నుంచి 4 కిలోల తేనె ఉత్పత్తి అవుతోంది. నాణ్యమైన తేనె 1 కిలో ధర 300 చొప్పున అమ్ముకున్నా లాభాలు గడించవచ్చు ఇందిరారెడ్డి తేనెటీగల పెంపకంతోపాటు పలువురికి శిక్షణ ఇచ్చి మార్కెటింగ్‌ చేస్తున్నారు.

అమెరికా నుంచి..

గతంలో అమెరికాలో ఉద్యోగం చేసిన ఇందిరారెడ్డి... కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చి... ఇక్కడ ఓ ప్రైవేటు పాఠశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. కొవిడ్‌ సమయంలో బడులు లేకపోవడంతో ఖాళీగా ఉండకుండా ఎన్ ఐసీఆర్​డీ(NIRD)లో శిక్షణ పొందారు. తేనెటీగల పెంపకం ప్రాధాన్యత తెలుసుకుని... సదాశివపేట వద్ద పొద్దుతిరుగుడు క్షేత్రంలో తేనెటీగల పెంపకం ప్రారంభించారు. క్రమంగా వివిధ జిల్లాల్లో విస్తరించారు. కేంద్రం భారీ రాయితీలు ఇస్తున్న దృష్ట్యా.... యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇందిరారెడ్డి సూచించారు.

తేనె తీయడంతోపాటు బ్రాండింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ చిన్న రైతులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తుండటంతో.... ఉద్యానశాఖ ఇందిరారెడ్డిని తేనెటీగల పెంపకం కమిటీ సభ్యులుగా నియమించింది.


ఇదీ చూడండి:

cm kcr review: 'సమాన వాటాకోసం బలమైన వాణి వినిపించండి'

ABOUT THE AUTHOR

...view details