తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రుల సంఘీభావం

ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రవాసాంధ్రులు పర్యటించారు. అమరావతి కోసం కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు.. ప్రవాసాంధ్రుల తరపున అనిల్ బృందం సంఘీభావం తెలిపింది. ఉద్యమానికి మద్దతుగా రూ. 4.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. అన్నంపెట్టే రైతన్న రోడ్డెక్కి నిరసన తెలపడం బాధాకరమన్నారు.

amaravati, farmers
అమరావతి

By

Published : Mar 25, 2021, 7:56 PM IST

ఆంధ్రప్రదేశ్ అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రవాసాంధ్రులు మద్దతు ప్రకటించారు. ఎన్​ఆర్​ఐ అనిల్.. తన మిత్రులతో కలిసి రాజధాని గ్రామాల్లో ఈరోజు పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడి.. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. తన వంతుగా ఉద్యమానికి రూ.4.20 లక్షలు విరాళం అందజేశారు. దేశానికి అన్నం పెట్టే రైతు.. రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిరావడం బాధాకరమన్నారు. ఈ పోరాటానికి తనతో పాటు విదేశాల్లోని తెలుగు వారందరూ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.

రాజధాని విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో.. వేలాది మంది రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణం ఆపివేయడంతో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రుల సంఘీభావం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details