అమెరికాలోనే పుట్టాడు.. అక్కడే చదువుకున్నాడు... మాతృభాషపై మమకారం మాత్రం మరిచిపోలేదు. అతితక్కువ కాలంలోనే తల్లిదండ్రుల నుంచి భాష, గురువుల నుంచి పద్యాలు నేర్చుకుని ఏకసంథాగ్రాహిగా పేరొందాడు. తెలుగు, సంస్కృత భాషల్లో విశేష ప్రతిభ కనబరచడమే కాకుండా ఏకంగా అష్టావధానమే చేస్తున్నాడు. చిన్న వయసులోనే ఎనిమిది అష్టావధానాలు పూర్తిచేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు ప్రవాస భారతీయుడు లలిత్.
రెండు భాషల్లో పట్టు
హైదరాబాద్కు చెందిన గన్నవరం లలిత్ ఆదిత్య కుటుంబం రెండుతరాల కిందటే అమెరికాలో స్థిరపడింది. తల్లిదండ్రులు మారుతి శశిధర్, శైలజ ప్రత్యేక శ్రద్ధతో లలిత్కి తెలుగు, సంస్కృతం నేర్పించారు. చిన్ననాటి నుంచి ఆంగ్లమాధ్యమాల్లో చదివినా..తల్లిదండ్రుల చొరవ, ఆసక్తితో రెండు భాషల్లో పట్టు సాధించాడు. టీవీల్లో ప్రవచనాలు విని ఇతిహాసాలపై మక్కువ పెంచుకున్నాడు. మల్లాప్రగడ శ్రీనివాస్, చిట్టాప్రగడ లలిత వద్ద సంస్కృత వ్యాకరణలనూ కంఠస్థం చేశాడు. దూళిపాళ్ల మహాదేవన్ వద్ద అవధానంతో పాటు చందస్సులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఫోన్ ద్వారా రాజమండ్రి రాయప్రోలు కామేశ్వర శర్మ నుంచి సంధులు, సమాసాలు సహా చందశాస్త్రం నేర్చుకున్నాడు.
అతనోక యువశిరోమణి