హీరా గ్రూప్‌కు చెందిన బ్రాంచి ఆఫీసును బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఆ గ్రూప్ అధినేత నౌహీరా షేక్ పునప్రారంభించారు. ముస్లిం మహిళల అభివృద్ధి కోసం హీరా గ్రూప్ ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేశామని ఆమె వెల్లడించారు.
హీరా గ్రూప్ సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: నౌహీరా షేక్ - హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ తాజా వార్తలు
తనను కొందరు రాజకీయ ఒత్తిళ్లకు గురిచేశారని.. అక్రమ కేసులు పెట్టారని హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ పేర్కొన్నారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆమె బంజారాహిల్స్‌లో హీరా గ్రూప్ బ్రాంచి ఆఫీసును పునప్రారంభించారు.
హీరా గ్రూప్, నౌహీరా షేక్ , బంజారాహిల్స్ వార్తలు
గతంలో హీరా గ్రూప్‌పై ఈడీ కేసు నమోదు చేసి కార్యాలయాన్ని సీజ్ చేశారు. నౌహీరా షేక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. తనను కొందరు అవాస్తవాలతో రాజకీయ ఒత్తిళ్లకు గురిచేసి.. అక్రమ కేసులు పెట్టారని ఆమె పేర్కొన్నారు. హీరా గ్రూప్ సభ్యులందరినీ ఆర్థికంగా బలపడే విధంగా కృషి చేస్తానని.. తానెవరికీ భయపడనని స్పష్టం చేశారు.