నౌహీరాషేక్ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది బంగారం పేరిట పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామని మోసం చేసిన నౌహీరాషేక్ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీసీఎస్ పోలీసులు పిటిషన్దాఖలు చేశారు. కేసు పురోగతి కోసం కస్టడీకి ఇవ్వాలంటూ సీసీఎస్ తరఫు న్యాయవాది వాదించారు. హీరా గ్రూపు సంస్థల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కొందరు ఉద్దేశ పూర్వకంగానే నౌహీరాషేక్‌ను ఇరికించారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణ సోమవారానికి వాయిదా వేశారు.
చిత్తూరు జైల్లో ఉన్న నౌహీరాషేక్‌ను కూకట్పల్లి పోలీసులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఐదు రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. కస్టడీ ముగియడంతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం... సీసీఎస్ పోలీసులు పీటీ వారెంట్ పై నౌహీరాషేక్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.