తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2019, 8:11 PM IST

ETV Bharat / state

ఇక హైటెక్ సిటీ వరకు మెట్రో పరుగులు

ఎంతోకాలంగా టెకీస్, సాఫ్ట్​వేర్ ఉద్యోగులు ఎదురుచూస్తున్న అమీర్‌పేట్‌ - హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైల్‌ ప్రయాణానికి మార్గం సుగమమైంది. కమిషన్‌ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అన్ని అనుమతులు ఇచ్చేసింది.

త్వరలోనే అమీర్‌పేట్‌ - హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు

అమీర్‌పేట్‌ - హైటెక్ సిటీ మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఆర్ఎంఎస్

అమీర్‌పేట్‌ - హైటెక్ సిటీ మార్గంలో త్వరలో మెట్రో రైల్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గంలో రైళ్లు నడిపేందుకు కమిషన్‌ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అనుమతిచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి తెలిపారు. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సేవలను సాధారణంగానే ప్రారంభించాలని నిర్ణయించారు. మెట్రో సేవలు ప్రారంభించే తేదీలు త్వరలోనే వెల్లడిస్తామని ఎన్​.వి.ఎస్. రెడ్డి పేర్కొన్నారు. ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభమైతే.. జూబ్లీహిల్స్, అమీర్ పేట మార్గంలో ట్రాఫిక్ భారీగా తగ్గనుంది.

ABOUT THE AUTHOR

...view details