Notification for TSPSC Chairman and Persons Recruitment: రాష్ట్రంలో కొత్త సర్కార్ వచ్చిన తరవాత టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి. జనార్దన్ రెడ్డి, ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ సీఎస్ శాంతికుమారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను secy-ser-gad@telangana.gov.inకు మెయిల్ చేయాలని సీఎస్ తెలిపారు.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు - త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు ముమ్మరం
TSPSC Chairman Recruitment Notification : దరఖాస్తుతో పాటు అర్హతలు, విధివిధానాలను నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీలో ఛైర్మన్ సహా 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంటుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316, టీఎస్‌పీఎస్సీ నియమావళి ప్రకారం సంస్థ ఛైర్మన్, సభ్యుల అర్హతలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. కమిషన్‌లోని సభ్యుల్లో కనీసం సగం మంది కేంద్రంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో పదేళ్లు ఉద్యోగం చేసిన వారై ఉండాలని పేర్కొంది. మిగతా సభ్యులను అకడమిక్, మేనేజ్‌మెంట్, న్యాయ, శాస్త్ర, సాంకేతిక, హ్యుమానిటీస్ రంగాల్లో ప్రముఖల నుంచి ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి