దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్ ప్రాంగణాలు నాలుగు రకాల పీజీ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి.
అవి:
1. ఎం.ఫార్మసీ:మొహలీ, హాజీపూర్, గువహటిలలోని నైపర్‌లు అందించే ఎం.ఫార్మసీ కోర్సులో మూడు రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రిసెర్చ్.
2. ఎం.ఎస్. (ఫార్మా):ఈ కోర్సులో పది రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఫార్మాస్యూటిక్స్, నేచురల్ ప్రాడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ట్రెడిషనల్ మెడిసన్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, మెడికల్ డివైజెస్, బయో టెక్నాలజీ, ఫార్మకో ఇన్‌ఫర్మేటిక్స్.
3. ఎం.టెక్ (ఫార్మా): దీనిలో రెండు పీజీ కోర్సులు ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయో టెక్నాలజీ), ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ).
4. ఎంబీ.ఏ (ఫార్మా): ఇది ఫార్మసీలో మేనేజ్‌మెంట్ కోర్సు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ నమోదుకు చివరి తేదీ: 8 మే 2021
అడ్మిట్ కార్డ్టు లభ్యమయ్యే తేదీ: 21 మే 2021
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 5 జూన్ 2021 ఎంబీఏ (ఫార్మా) లో చేరే విద్యార్థులకు జాయింట్ కౌన్సెలింగ్ (గ్రూప్ ఇంటర్వ్యూ) ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: దేశంలోని 16 కేంద్రాలలో నైపర్ జేఈఈ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో- విజయవాడ, హైదరాబాద్.పరీక్ష విధానం
నైపర్-జేఈఈ 2021 పరీక్ష బహుళైచ్ఛిక (మల్టిపుల్ ఛాయిస్) పద్ధతిలో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 200 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు.
స్కోరు కోసం...
నైపర్- జేఈఈలో మంచి స్కోరు సాధించాలంటే పుస్తక పరిజ్ఞానంతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, అనలిటికల్ రీజనింగ్ నైపుణ్యాలు ముఖ్యం. ప్రతి పాఠ్యాంశాన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.