TS Legislative Council: శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇవాళ దీనిపై నోటిఫికేషన్ విడుదల కానుంది. గురువారం నామినేషన్ల స్వీకరణ అనంతరం ఎన్నిక జరుగుతుంది. మండలిలో తెరాసకు పూర్తిస్తాయి మెజార్టీ ఉన్నందున రెండు పదవులూ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. తాజాగా శాసనమండలి సమావేశాలు జరుగుతున్నందున ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
TS Legislative Council: ఇవాళ మండలి ఛైర్మన్, ఉపఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ - ts news
TS Legislative Council: నేడు మండలి ఛైర్మన్, ఉపఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. గురువారం నామినేషన్ల స్వీకరణ అనంతరం ఎన్నిక జరుగుతుంది. మండలిలో తెరాసకు పూర్తిస్తాయి మెజార్టీ ఉన్నందున రెండు పదవులూ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
TS Legislative Council: నేడు మండలి ఛైర్మన్, ఉపఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్
ముందుగా గవర్నర్ అనుమతి తీసుకొని ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మండలి ఛైర్మన్ పదవి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికే లభించే అవకాశం ఉంది. మరోవైపు డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్ ఎంపికకానున్నారని తెలుస్తోంది.
ఇదీ చదవండి:
Last Updated : Mar 9, 2022, 5:56 AM IST