శాంతి భద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆధునిక పరికరాల కొనుగోలు, కొత్త వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి పోలీస్ శాఖకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో... భారీ వర్షాల సమయంలో పోలీసులు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు.
త్వరలో 20వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్: మహమూద్ అలీ - telangana dgp mahender reddy
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 18వేలకు పైగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. త్వరలో మరో 20వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొన్న మంత్రి మహమూద్.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 18వేలకు పైగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశామని హోంమంత్రి అన్నారు. త్వరలో మరో 20వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 1162మంది ఎస్సైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సైల నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. సమాజంలో మార్పు పోలీసులతోనే సాధ్యమని.. పోలీసులు శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు.. హరితహారం, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వామ్యం కావాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. నిజాయతీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.