తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇళ్లలోకి వెళ్లడు.. కానీ దొంగతనం చేస్తాడు - సికింద్రాబాద్ తాజా వార్తలు

అతను రాత్రివేళల్లో మాత్రమే దొంగతనాలు చేస్తాడు.. అదికూడా ఇళ్లలోకి వెళ్లడు, తాళాలు పగులగొట్టడు.. కేవలం ఇంటి బయట ఉన్న బైక్​లపై మాత్రమే కన్నేస్తాడు.. వాటిని అదును చూసి ఎత్తుకెళ్తాడు. కానీ దొంగ చివరికి దొరికిపోయాడు.

Not going home but stealing at mahankali police station at secunderabad
ఇళ్లలోకి వెళ్లడు.. కానీ దొంగతనం చేస్తాడు

By

Published : Mar 4, 2020, 7:41 PM IST

ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్​లోని మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇంటి బయట నిలిపి ఉన్న వాహనాలే లక్ష్యంగా చేసుకుని రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మహమ్మద్ జాఫర్ యాకుత్​పూరాలో నివాసం ఉంటున్నాడు.

గతంలో మహంకాళి పోలీస్​స్టేషన్ పరిధిలో మూడు బైకులు, నిజామాబాద్​లో మరో బైక్​ను నకిలీ తాళం ఉపయోగించి తీసుకెళ్లాడు. సమాచారం తెలుసుకున్న మహంకాళి పోలీసులు ఛేదించి నిందితున్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

ఇళ్లలోకి వెళ్లడు.. కానీ దొంగతనం చేస్తాడు

ఇదీ చూడండి :అరబ్​షేక్​ల లీలలు.. పాతబస్తీ యువతులతో రహస్య పెళ్లిల్లు

ABOUT THE AUTHOR

...view details