ఆర్టీసీ సమ్మెతో తక్కువగా నడుస్తున్న బస్సులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నడుపుతున్న అరకొర బస్సులతో విద్యార్థులు నానా అవస్థలు పడుతూ కళాశాలలకు వెళుతున్నారు. బస్సులకు వేలాడుతూ ప్రమాద కరంగా ప్రయాణిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ అప్జల్‌గంజ్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్తున్న బండ్లగూడ డిపో బస్సుకు వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. వారి ప్రయాణం సర్కస్ ఫీట్లను తలపించింది.
సర్కస్ ఫీట్లను తలపించే విద్యార్థుల పాట్లు - hyderabad student bus travelling problems
ఆర్టీసీ సమ్మెతో ప్రజలే కాదు విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అరకొర బస్సులనే ప్రభుత్వం నడుపుతోంది. దీనితో విద్యార్థులు కళాశాలలు, గమ్య స్థానాలకు వెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది.
![సర్కస్ ఫీట్లను తలపించే విద్యార్థుల పాట్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5135063-964-5135063-1574336996741.jpg)
సర్కస్ ఫీట్లు కాదు.. విద్యార్థుల పాట్లు
సర్కస్ ఫీట్లు కాదు.. విద్యార్థుల పాట్లు
ఇదీ చూడండి : 'ఫోటో అంటే భవిష్యత్ తరాలకు గుర్తుండిపోవాలి'