ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 15లక్షల రూపాయల విలువ చేసే 367గ్రాముల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్ - ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు.
Hyderabad north task force polices Arrest of two persons for theft of houses
నిందితులు మహేశ్, శ్రీశైలంపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులున్నాయన్నారు. పీడీ చట్టం కింద ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించినా... వీరిలో ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సీపీ తెలిపారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మరోసారి దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించామని... నగరవాసులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని అంజనీ కుమార్ కోరారు.