ప్రభుత్వం ఇచ్చిన 25హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గిరిజన ప్రజా సమాఖ్య సంఘం సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆ సంఘ నాయకులు ఆరోపించారు.
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపైహైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్క్లబ్లోగిరిజన ప్రజా సమాఖ్య సంఘం సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన 25 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆ సంఘ నాయకులు ఆరోపించారు. 10శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షడు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల అడవుల్లో చేపడుతున్న యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు సంబంధించి పట్టా పుస్తకాలను అందజేయాలన్నారు.