హైదరాబాద్-బెంగళూరు...
అత్యంత కీలకమైన ఈ జాతీయ రహదారిపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరమ్మతులకు ఆటంకంగా ఉంది. అప్పచెరువుకు గండి పడటంతో రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్ వద్ద హైవే పూర్తిగా ధ్వంసమయింది. సైబరాబాద్ పోలీసులు వాహనాలను ఓఆర్‌ఆర్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.
హైదరాబాద్-విజయవాడ...
అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెడ్డికుంట చెరువు తెగి ఇమామ్‌గూడ వద్ద విజయవాడ జాతీయ రహదారి దెబ్బతినగా మరమ్మతులు మొదలు కాలేదు. మూడు లైన్లకు గాను ఒక లైన్ పూర్తిగా కోతకు గురయింది. కోతకు గురైన రోడ్డుకు రక్షణగా బారికేడ్లను ఉంచి.. మిగిలిన రెండు లైన్లలో ట్రాఫిక్‌ను అనుమతిస్తున్నారు. కొత్తగూడ దగ్గర వంతెన కుంగిపోగా మరమ్మతులు చేస్తున్నారు. మరో వంతెనపై వాహనాలను అనుమతిస్తున్నారు. వంతెన దాటడానికి దాదాపు అరగంట సమయం పడుతోంది. హైదరాబాద్ వెళ్లే మార్గంలో తుఫ్రాన్‌పేట శివారు వరకు; విజయవాడ మార్గంలో బాటసింగారం వరకు రద్దీ నెలకొంది. బుధవారం చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు గంటలో చేరాల్సిన వాహనాలకు ఏడెనిమిది గంటలు పట్టింది. ఇప్పుడు ఆ సమయం బాగా తగ్గింది.
హైదరాబాద్-వరంగల్...
ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగడంతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని వరద నీరు ముంచెత్తింది. ఇక్కడా మరమ్మతులు ఇంకా పట్టాలెక్కలేదు. ఉప్పల్‌లో కి.మీ.కు పైగా రోడ్డు కొట్టుకుపోయింది. రక్షణగా బారికేడ్లను పెట్టి మిగిలిన రోడ్డుపై నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు.
ఇవీచూడండి:ఓ వైపు వర్షం... మరో వైపు అంధకారం... నగరవాసుల ఇక్కట్ల పర్వం