non essential surgeries cancelled in gandhi hospital: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు సైతం.. పెరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా ఎఫెక్ట్.. నేటి నుంచి గాంధీలో ఆ సేవలు బంద్ - నేటి నుంచి గాంధీలో ఆ సేవలు బంద్
13:35 January 11
non essential surgeries cancelled in gandhi: అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేత
గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి గాంధీలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర శస్త్రచికిత్సల్లో ఎలాంటి ఆటంకం ఉండదని వెల్లడించింది.
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో గాంధీలో ఇప్పటికే జీనోమ్ సీక్వెన్సింగ్ ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఒమిక్రాన్‌కు కొత్తగా చికిత్స లేదని పేర్కొన్నారు. తప్పక అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: Covid Treatment in Gandhi: 'గాంధీలో త్వరలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్'