NBW on TRS MLA's: తెరాస ఎమ్మెల్యేలపై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఎందుకంటే? - rasamai balakishan
![NBW on TRS MLA's: తెరాస ఎమ్మెల్యేలపై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఎందుకంటే? Non-bailable warrant issued against two TRS MLAs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14955898-462-14955898-1649338782477.jpg)
17:51 April 07
NBW on TRS MLA's: తెరాస ఎమ్మెల్యేలపై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఎందుకంటే?
NBW on TRS MLA's: ఇద్దరు అధికార తెరాస ఎమ్మెల్యేలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తెరాస ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, నన్నపనేని నరేందర్‌పై ప్రజా ప్రతినిధుల కోర్టు ఎన్బీడబ్ల్యూ నోటీసులు ఇచ్చింది. ఓ కేసులో విచారణకు హాజరు కానుందువల్ల ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వెల్లడించింది. ఇటీవల కొందరు ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు కూడా ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది.
కరీంనగర్ ఎల్ఎండీ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాజీపేటలో నమోదైన మరో కేసులో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు హాజరు కాకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలపై కోర్టు ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. నిర్మల్‌లో 2012లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసు విచారణ ముగిసింది. అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై తీర్పును ఈనెల 12కి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చూడండి:MLA Shankar Nayak: తెరాస ఎమ్మెల్యేపై కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు