వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో... రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాని ... మొదటి రోజు 46 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మాత్రమే 106 స్లాట్లు బుక్ అయ్యాయి. వాటిలో 77 రిజిస్ట్రేషన్లు పూర్తికాగా... 29పెండింగ్‌లో ఉన్నాయి. కొందరు తమకిచ్చిన తేదీలను రీషెడ్యూల్ చేసుకోగా... మరికొందరు ఇరు పార్టీలు హాజరు కాకపోవడం, ఆధార్ కార్డుల్లో ఇబ్బందుల వల్ల పెండింగ్‌లో పడ్డాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన మేరకు మ్యూటేషన్ పూర్తి చేసి ఈ పాస్‌పుస్తకాలు ఇచ్చినట్లు అదికారులు తెలిపారు.
మొదలైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ - హైదరాబాద్ తాజా వార్తలు
దాదాపు మూణ్నెళ్ల తర్వాత వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుండగా కార్డు విధానంలో నిర్వహిస్తున్నారు. తొలిరోజు 77 వ్యవసాయేతర ఆస్తులు, భూములు రిజిస్ట్రేషన్ అయ్యినట్లు ఆశాఖ వెల్లడించింది.
మొదలైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
రంగారెడ్డి జిల్లా పరిధిలో 29 స్లాట్లు బుకింగ్ కాగా....21 మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో 12 స్లాట్లు బుకింగ్ కాగా అందులో 10 మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యినట్లు అధికారులు వివరించారు.
ఇదీ చూడండి:ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు