జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా వచ్చిన నామినేషన్లు - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు
20:13 November 20
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా వచ్చిన నామినేషన్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లకు చివరి రోజైన ఇవాళ ఒక్కరోజే 1,223 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు 1,421 మంది అభ్యర్థులు... 1,889 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. భాజపా నుంచి 428, తెరాస నుంచి 424, కాంగ్రెస్ నుంచి 275, ఎంఐఎం నుంచి 58, తెదేపా నుంచి 155, సీపీఐ 12 , సీపీఎం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. గుర్తింపు పొందిన పార్టీల నుంచి 66, స్వతంత్ర్య అభ్యర్థుల నుంచి 454 నామినేషన్లు వచ్చాయి.
నామినేషన్ల ప్రక్రియ ముగియడం వల్ల రేపు నామినేషన్లను పరిశీలన చేయనున్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఫార్మ్- బీ రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు అందించే అవకాశం ఎస్ఈసీ కల్పించింది.