జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజు హైదరాబాద్‌లో ఘనంగా కొనసాగుతోంది. నామినేషన్ కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలు, పెద్ద ఎత్తున జనాలు ఉండకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులు.. అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామపత్రాలను అందజేశారు.
భాగ్యనగరంలో జోరుగా ఆఖరు రోజు జీహెచ్ఎంసీ నామినేషన్ ప్రక్రియ
హైదరాబాద్ నగరవ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఆఖరు రోజున వివిధ పార్టీల అభ్యర్థులు చేరుకుని.. నామపత్రాలను సమర్పించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు.
భాగ్యనగరంలో జోరుగా ఆఖరు రోజు జీహెచ్ఎంసీ నామినేషన్ ప్రక్రియ
అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో హిమాయత్‌నగర్ సీపీఐ అభ్యర్థిగా ఛాయాదేవి, దత్తాత్రేయనగర్ తెరాస అభ్యర్థి సలీమ్, బాగ్ అంబర్‌పేట సీపీఎం అభ్యర్థి వరలక్ష్మి, అంబర్‌పేట భాజపా అభ్యర్థి పద్మ వెంకట్‌రెడ్డి, జాంబాగ్ భాజపా అభ్యర్థి రూప్ ధరక్, గోల్నాక స్వతంత్ర అభ్యర్థి పల్లవి తదితరులు నామినేషన్ దాఖలు చేశారు.