గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు తెరాస, భాజపా, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి మొత్తం 24 నామపత్రాలు దాఖలు చేశారు.
మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో 24 నామినేషన్లు దాఖలు - జీహెచ్ఎంసీ ఎన్నికల వార్తలు
నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి.
![మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో 24 నామినేషన్లు దాఖలు nominations ended in masab tank polytechnic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9604718-428-9604718-1605868802351.jpg)
మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో 24 నామినేషన్లు దాఖలు
గుడిమల్కాపూర్ డివిజన్లో కమలం నుంచి కరుణాకర్, తెరాస నుంచి బంగారు ప్రకాష్, కాంగ్రెస్ నుంచి వేణు, హైమద్ నగర్ డివిజన్లో భాజపా నుంచి రాధా బాయి, ఎంఐఎం నుంచి సర్ఫరాజ్, తెరాస నుంచి సారిక నామినేషన్ వేశారు. విజయనగరకాలనీలో భాజపా నుంచి అశ్వని, ఎంఐఎం నుంచి కసిమ్, తెరాస నుంచి స్వరూప నామినేషన్లు దాఖలు చేశారు.
ఇదీ చదవండి:ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు