ఏపీలో పురపాలక ఎన్నికలకు నేడు నామినేషన్లు స్వీకరణ జరగనుంది. అయితే... బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించిన ప్రాంతాల్లో మాత్రమే నేడు నామపత్రాలు తీసుకోనున్నారు. ఈ మేరకు అవకాశం కల్పించిన ఎస్‌ఈసీ.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు తెలిపింది.
బలవంతంగా ఉపసంహరణలు జరిగిన చోట.. మరో అవకాశం..! - ap news
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా... గతంలో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించిన చోట.. ఇవాళ మరోసారి నామపత్రాలు స్వీకరించేందుకు ఎస్ఈసీ అవకాశం కల్పించింది. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.
బలవంతంగా ఉపసంహరణలు జరిగిన చోట.. మరో అవకాశం..!
అనంతరం.. నామపత్రాలను పరిశీలిస్తారు. రేపు మధ్యాహ్నం 3 వరకు ఉపసంహరణ గడువుగా అధికారులు తెలిపారు. తిరుపతిలోని 2, 8, 10, 21, 41, 45 వార్డులకు.. పుంగనూరులోని 9, 14, 28 వార్డులకు.. రాయచోటిలో 20, 31 వార్డులకు... కడప జిల్లా ఎర్రగుంట్లలోని 6, 11, 15 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఇదీ చదవండి:జాతీయ సగటు కంటే రాష్ట్రం మెరుగు