Nomination Festival in Telangana Elections :శాసన సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు కొండగట్టు అంజన్నను (Kondagattu Temple)దర్శించుకున్న ఆయన.. అక్కడి నుంచి భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా దాసరి ఉష నామినేషన్ వేశారు. హనుమకొండ జిల్లా పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ నామినేషన్ వేశారు.
Etela Rajender Nomination in Gajwel : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కమల పార్టీ అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్ పత్రాలను రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అందజేశారు. జనగామ ఆర్డీవో కార్యాలయంలో బీఆర్ఎస్(BRS Party) అభ్యర్థి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోటీగా నామినేషన్ వేసినట్లు ఈటల పేర్కొన్నారు.
తెలంగాణలో జోరుగా నామినేషన్లు, ఇవాళ ముఖ్య నాయకుల్లో రేవంత్, బండి సంజయ్
"కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పంచాయితీ జరుగుతుంది. పేదల కలలు కొల్లగొట్టిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోబోతుంది. హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్‌లో ఎక్కువ మెజార్టీ రాబోతుంది. ప్రతి నాయకుడు ఉద్యమంలా పని చేసి పార్టీని నిలబెట్టండి." - ఈటల రాజేందర్, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి