తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే కోటా లాంఛనమే - గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై వీడని పీటముడి

Nominated Quota MLC Election Delay in Telangana 2024 : రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై పీటముడి ఇప్పట్లో వీడేలా కనిపించటంలేదు. హైకోర్టులో న్యాయపరమైన చిక్కులు ఉండడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కానుంది.

delay Nominated Quota MLC in Ts
delay Nominated Quota MLC in Ts

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 9:29 AM IST

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై వీడని పీటముడి

Nominated Quota MLC Election Delay in Telangana 2024 : శాసనసభ ఎన్నికల ఫలితాలు, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో శాసన మండలి ఎన్నిక సందడి కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటా మండలి సభ్యులుగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, కాంగ్రెస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లు ఏకగ్రీవంగా ఎన్నికవటం లాంఛనమే కానుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరు మాత్రమే నామినేషన్లు వేయటంతో పోటీ లేకుండా పోయింది. ఎన్​ఎస్​యూఐ నేపథ్యం నుంచి వచ్చిన ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడంపై కాంగ్రెస్‌ కార్యకర్తల్లో హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ఇప్పుడు ఇది నిరూపితమైందని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Governor Quota MLC in Telangana : ఇకగవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీలకు చెందిన కసరత్తు దాదాపు పూర్తైంది. అయితే గవర్నర్ కోటా కింద గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరికీ ఆమోదం తెలపకుండా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundara rajan) తిప్పి పంపారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ పేర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయ్యేందుకు తగిన అర్హతలు లేవని తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు.

12 లోక్​సభ స్థానాలపై కాంగ్రెస్​ గురి - ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన

ఎంపిక మరింత ఆలస్యం : తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో వేసిన పిటిషన్ల విచారణను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా? అనే అంశంపై ఈ నెల 24వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో కేసును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్విస్ట్ ఇచ్చారు. ధర్మాసనంలో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని తమిళిసై సౌందర రాజన్ నిర్ణయం తీసుకున్నారు.

ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

త్వరలోనే కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం : ఇక నామినేటెడ్ పదవుల విషయంలో ముఖ్యమైన కార్పొరేషన్ ఛైర్మన్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం విదేశాల నుంచి తిరిగి రానుండడంతో ఆరోజు కానీ, మరుసటి రోజు కానీ నామినేటెడ్ పదవుల ఎంపికపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ గెలుపునకు కృషి చేసిన వారితో పాటు, ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన నాయకులతో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని దాదాపు 20 మందికి ఛైర్మన్ పదవులను కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ బరిలో రెండే నామినేషన్లు - మహేశ్, బల్మూరి ఎన్నిక ఏకగ్రీవం!

టార్గెట్​ 2024- 500 స్థానాల్లో కాంగ్రెస్ సర్వే! సీట్ల పంపకం చర్చలకు ముందే!

ABOUT THE AUTHOR

...view details