గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని 30 సర్కిళ్లలో సహాయ వైద్యులను కొవిడ్ నోడల్ అధికారులుగా నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నోడల్ అధికారుల నియామకం: లోకేశ్ కుమార్ - జీహెచ్ఎంసీలో ఎన్నికల ఏర్పాట్లు
కరోనా వల్ల పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ వెల్లడించారు. నగరంలోని 30 సర్కిళ్లలో కొవిడ్ నోడల్ అధికారులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నోడల్ అధికారుల నియామకం: లోకేశ్ కుమార్
జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం లక్షా 20 వేల కరోనా కిట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి పది కిట్లు పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రానికి ఐదు చొప్పున 60 వేల శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు.