నో వ్యాక్సిన్... నిరాశగా వెనుదిరిగిన ప్రజలు - ముషీరాబాద్ కరోనా వార్తలు
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టీకా కోసం వచ్చిన ప్రజలకు నిరాశ తప్పలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల టీకా కోసం వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు.
msrd
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని కొన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వెేయలేదు. ముషీరాబాద్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో కొనసాగుతున్న గగన్ మహల్ పట్టణ ఆరోగ్య కేంద్రం లోయర్ ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్ పట్టణ ఆరోగ్య కేంద్రాలలో టీకా వేయలేదు. ఈ విషయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు ఆయా కేంద్రాల నుంచి వెనుదిరిగారు.