కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అవసరం ఉంటేనే బయటకు రావాలని వైద్యులు, అధికారులు హెచ్చరించటంతో బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది.
కరోనా భయంతో రోడ్లపై తగ్గిన రద్దీ
వాహనరాకపోకలతో ఎప్పుడు రద్దీగా కనిపించే హైదరాబాద్ మహానగర రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే కూడళ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. కరోనా భయంతో నగరవాసులు బయటకు రావడానికి బయపడుతున్నారు.
కరోనా భయం
తప్పనిసరి అయితే తప్ప బయటకు రావడం లేదు. ఎప్పుడూ ట్రాఫిక్‌తో ఉండే తెలుగుతల్లి ఫ్లైఓవర్, బీర్కేభవన్, అసెంబ్లీ, నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, ఎర్రమంజిలి, పంజాగుట్ట కూడాళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఇదీ చదవండి:భద్రాద్రిలో ఇద్దరు అర్చకులకు కరోనా