తెలంగాణ

telangana

ETV Bharat / state

APPRC committee: 'ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదు'.. పీఆర్సీ సాధన సమితి నిర్ణయం - prc news

APPRC committee: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయం తీసుకుంది. జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలని భేటీలో సాధన సమితి నేతలు నిర్ణయించారు.

APPRC committee
APPRC committee

By

Published : Jan 25, 2022, 3:00 PM IST

APPRC committee: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని ఏపీ పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని భేటీలో నిర్ణయం తీసుకుంది. ఏపీలోని విజయవాడ ఎన్జీవో హోంలో పీఆర్​సీ సాధన సమితి నేతలు భేటీ అయిన నేతలు మంత్రుల కమిటీ ఆహ్వానంపై చర్చలకు వెళ్లాలా లేదా అన్న అంశంపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను చర్చలకు వచ్చి చెప్పొచ్చు కదా అని ప్రభుత్వం పదే పదే చేస్తున్న విజ్ఞప్తులపై నేతలు సమాలోచనలు జరిపారు. జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలని భేటీలో సాధన సమితి నేతలు నిర్ణయించారు.

సచివాలయానికి చేరుకున్న మంత్రుల కమిటీ

ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి మంత్రుల కమిటీ సచివాలయానికి చేరుకుంది. మంత్రులు బుగ్గన, పేర్నినాని, సజ్జల, అధికారులు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తారని నిరీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details