తెలంగాణ

telangana

ETV Bharat / state

Petrol Problems in hyderabad: బంకుల్లో నో స్టాక్​ బోర్డులు.. రాజధానిలో ఎందుకిలా..?

Fuel Problems in hyderabad: హైదరాబాద్​లోని పెట్రోల్ బంకుల్లో వాహనదారుల క్యూలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా నో స్టాక్​ బోర్టులే స్వాగతం పలుకుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Fuel Problems in hyderabad
బంకుల్లో నో స్టాక్​ బోర్డులు

By

Published : Jun 27, 2022, 8:10 PM IST

Fuel Problems in hyderabad: భాగ్యనగరంలో పెట్రోల్, డీజిల్ కొరత నగర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహన దారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హిమాయత్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హిమాయత్​నగర్ వై జంక్షన్ కూడలిలోని భారత్ పెట్రోలియం బంక్​లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదర్​గూడలోని భారత్ పెట్రోలియం బంక్​లో పెట్రోల్ ఉన్నప్పటికీ డీజిల్ లేకపోవడంతో వినియోగదారులు నిరాశగా వెనుదిరిగారు. డీజిల్ కొరత ఉందని తెలుసుకున్న ప్రజలు.. బంకుల నుంచి ఒకేసారి అధికమొత్తంలో క్యానుల్లో డీజిల్ తీసుకొని వెళ్తున్నారు. పెట్రోల్ కొరత వల్ల చంచల్ గూడ జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్​ను అధికారులు మూసివేశారు.

బంకుల్లో నో స్టాక్​ బోర్డులు.. వాహనదారుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details