మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈనెల 20 తర్వాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవని సీఎం ప్రకటించారు. కేంద్రం సడలింపులు ప్రకటించినప్పటికీ.. రాష్ట్రంలో సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఎలాంటి సడలింపుల్లేవ్.. మే 7 వరకు లాక్‌డౌన్: కేసీఆర్
రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈనెల 20 నుంచి కేంద్రం సడలింపులు ప్రకటించినప్పటికీ.. రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.
ఎలాంటి సడలింపుల్లేవ్.. రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్: కేసీఆర్
గతంలో ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధనలు అలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు. మే 1 వరకు కూడా కొత్త కేసుల సంఖ్య తగ్గే పరిస్థితి లేదన్నారు. కేసుల సంఖ్య పెరగకూడదనే ఉద్దేశంతోనే సడలింపులు ఇవ్వడం లేదని కేసీఆర్ అన్నారు. మే 5న మరోసారి పరిస్థితిని కేబినెట్లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది