భాగ్యనగరంలోని షేక్‌పేట కూడలి నుంచి సెవెన్ టూమ్ మార్గంలో డివైడర్ ఏర్పాటు చేసి... హరితహారం కార్యక్రమంలో భాగంగా మెుక్కలు నాటారు. ఇటీవల డ్రైనేజీ నిర్మాణం కోసం మధ్యలో తవ్వడం వల్ల అక్కడ నుంచి పశువులు రోడ్డు డివైడర్ పైకి ఎక్కి మెుక్కలను తినేస్తున్నాయి.
డివైడర్ మధ్యలో మొక్కలను తీనేసిన పశువులు - no protection to plants
తెలంగాణ సర్కారు ఆరో విడత హరితహారం కార్యక్రమానికి సిద్ధమవుతోంది. కానీ గతంలో నాటిన మొక్కల రక్షణకు పలు చోట్ల పటిష్ఠ చర్యలు తీసుకోలేకపోయింది. హైదరాబాద్ షేక్‌పేట కూడలి సమీపంలోని రోడ్డు డివైడర్ మధ్యలో నాటిన మొక్కలను పశువులు తీనేస్తున్నాయి.
![డివైడర్ మధ్యలో మొక్కలను తీనేసిన పశువులు Hyderabad latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7501801-187-7501801-1591437388805.jpg)
Hyderabad latest news
పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు... నాటిన మొక్కల రక్షణ కోసం ట్రీ గార్డ్లు ఏర్పాటు చేయాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.