భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, పోలీసులు పదేపదే చెబుతున్నా.. పెడచెవిన పెడుతూ భాగ్యనగర మార్కెట్లలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. బొల్లారం వద్ద నిర్వహిస్తోన్న కూరగాయల మార్కెట్లో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
వినియోగదారులా.. వైరస్ వాహకులా? - no physical distance at bollaram vegetable market in hyderabad
లాక్డౌన్ కొనసాగుతున్నా ప్రజలు భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. భాగ్యనగరంలోని మార్కెట్లలో భౌతిక దూరం పాటించకుండా వినియోగదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
భాగ్యనగరంలో భౌతిక దూరం ఏది?
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తే మహమ్మారి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. భౌతిక దూరం పాటించకపోతే వినియోగదారులు వైరస్ వాహకులుగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు చర్యలు తీసుకొని మార్కెట్ వద్ద ఉన్న రద్దీని తగ్గించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
TAGGED:
భాగ్యనగరంలో భౌతిక దూరం ఏది?