ఏపీలోని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొంతమంది అడ్డుకుంటూన్నారనే అనే ఉద్ధేశంతో అమరావతి ఎమ్మార్పీఎస్ నేతలు మందడం నుంచి సచివాలయం వరకు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దీనికి వ్యతిరేకంగా అమరావతి దళిత ఐకాస నేతలు ర్యాలీ చేయాలని నిర్ణయించారు.
ఏపీ రాజధాని ప్రాంతంలో పోలీసుల గట్టి బందోబస్తు - తుళ్లూరు ర్యాలీ
ఏపీ రాజధాని ప్రాంతంలో ఎలాంటి ర్యాలీలు చేసేందుకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, మందడం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి ఎమ్మార్పీఎస్ నేతలను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ రాజధాని ప్రాంతంలో పోలీసుల గట్టి బందోబస్తు
పోలీసులు తుళ్లూరు మండలం వెంకటపాలెం, మందడం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. మరోవైపు అమరావతి ఎమ్మార్పీఎస్ నేతలను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.