తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్స్​ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలు రద్దు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం? - telangana news

TSPSC Group-1, Group-2 Jobs: భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం నియామక ప్రక్రియలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త జోనల్​ విధానంతో స్థానికులకే మెజారిటీ ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రూప్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలను తొలగించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రూప్స్​ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలు రద్దు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం?
గ్రూప్స్​ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలు రద్దు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం?

By

Published : Apr 7, 2022, 1:40 AM IST

TSPSC Group-1, Group-2 Jobs: గ్రూప్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలను తొలగించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో 80వేల పైచిలుకు పోస్టుల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో గ్రూప్ వన్ పోస్టులు 503, గ్రూప్ టూ ఉద్యోగాలు 582, గ్రూప్ త్రీ కేటగిరీలో 1373, గ్రూప్ ఫోర్ కింద 9,168 పోస్టులున్నాయి. ఇందులో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు అనుమతిచ్చింది. అనుమతి నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అయితే అన్ని పోస్టుల నియామకానికి ఇంటర్వ్యూలు లేకుండానే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గ్రూప్ టూ లోని కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు లేకపోగా.. మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలో 75 మార్కులున్నాయి. గ్రూప్ వన్ పోస్టులకు ఇంటర్వ్యూలో వంద మార్కులున్నాయి. అయితే అన్నింటికీ ఇంటర్వ్యూ లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం మార్కుల ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా సాధారణ పరిపాలనాశాఖ కసరత్తు చేస్తోంది. సంబంధిత దస్త్రాన్ని ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినట్లు సమాచారం. హస్తిన పర్యటన నుంచి తిరిగి వచ్చాక సీఎం కేసీఆర్ ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: ప్రజారోగ్య వైద్యంలో గుణాత్మక పురోగతి: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details