సింగరేణి కార్మికులకు 30 శాతం బోనస్ ఇస్తారని భావిస్తే ప్రభుత్వం 28 శాతం మాత్రమే ప్రకటించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ విధానాల వల్ల సింగరేణి ఆర్థిక సంక్షోభంలో పడనుందన్నారు. ఆర్టీసీ, విద్యుత్ రంగాలనే కాదు... మొత్తం రాష్ట్రాన్నే అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారని ఆరోపించారు. సంస్థలో వారసత్వ ఉద్యోగాలు కల్పించకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు వారసత్వ రాజకీయాలేందుకని ప్రశ్నించారు. సింగరేణికి చెల్లించే ప్రతి రూపాయిలో 49 శాతం కేంద్ర ప్రభుత్వానిదేనని లక్ష్మణ్ వెల్లడించారు.
'వారసత్వ ఉద్యోగాలు లేవు... వారసత్వ రాజకీయాలెందుకు?' - Bonus
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం గతంలో కంటే ఒకశాతం బోనస్ పెంచడం తప్ప... ప్రభుత్వం చేసిందేమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. సింగరేణి లాభాలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు.
'వారసత్వ ఉద్యోగాలు లేవు... వారసత్వ రాజకీయాలేందుకు?'
ఇవీచూడండి: వచ్చే నెలలో ఇందూరు వస్తా: సీఎం కేసీఆర్
Last Updated : Sep 19, 2019, 7:57 PM IST