తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతుడి బ్యాగులో పేలుడు పదార్థాలు లేవు: పోలీసులు - పోలీసుల విచారణ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో పేలుడుకు సంబంధించి జరిపిన ప్రాథమిక పరిశీలనలో మృతుడి బ్యాగులో ఎలాంటి పేలుడు పదర్థాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.

రాజేంద్రనగర్ పేలుడు సంఘటన స్థలంలో కొనసాగుతున్న పోలీసుల విచారణ

By

Published : Sep 8, 2019, 6:24 PM IST

Updated : Sep 8, 2019, 7:05 PM IST

రాజేంద్రనగర్ పేలుడుకు సంబంధించి... సంఘటనా స్థలంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఘటనలో చనిపోయిన అలీ వద్ద లభించిన బ్యాగులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన స్థలం పక్కనే అద్వైత్‌ బయో ఫ్యూయల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి చెందిన రసాయన డబ్బాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్యూయల్​తో ఉన్న వ్యర్థ పదార్థాల డబ్బాలను గుర్తించారు. కంపెనీ లోపల కూడా పోలీసులు తనఖీలు కొనసాగిస్తున్నారు.

రాజేంద్రనగర్ పేలుడు సంఘటన స్థలంలో కొనసాగుతున్న పోలీసుల విచారణ
Last Updated : Sep 8, 2019, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details