తెలంగాణ

telangana

ETV Bharat / state

42 వేల మంది విద్యార్థుల ఇళ్లల్లో టీవీలే లేవు

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పట్టణ ప్రాంతాల్లో విద్యాశాఖాధికారులు చేపట్టిన సర్వేలోనే 20 శాతం మంది విద్యార్థుల ఇళ్లలో టీవీ లేదని, మరో 30 శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌ లేదని తేలింది. గురువారం ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రతి విద్యార్థికి ఫోన్‌ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రతి పాఠశాలలో 20-25 శాతం మంది విద్యార్థులు టీవీ, స్మార్ట్‌ఫోన్‌ లేదని చెప్పారు.

42 వేల మంది విద్యార్థుల ఇళ్లల్లో టీవీలే లేవు
42 వేల మంది విద్యార్థుల ఇళ్లల్లో టీవీలే లేవు

By

Published : Aug 28, 2020, 7:05 AM IST

ప్రభుత్వ పాఠశాలల తలుపులు గురువారం తెరుచుకున్నాయి. ఉపాధ్యాయులు హాజరయ్యారు. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వచ్చే నెల ఒకటి నుంచి టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా డిజిటల్‌ పాఠాలు బోధించాలని విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పట్టణ ప్రాంతాల్లో విద్యాశాఖాధికారులు చేపట్టిన సర్వేలోనే 20 శాతం మంది విద్యార్థుల ఇళ్లలో టీవీ లేదని, మరో 30 శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌ లేదని తేలింది. గురువారం ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రతి విద్యార్థికి ఫోన్‌ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రతి పాఠశాలలో 20-25 శాతం మంది విద్యార్థులు టీవీ, స్మార్ట్‌ఫోన్‌ లేదని చెప్పారు. మూడు జిల్లాల్లో కలిపి ఇంట్లో టీవీ లేని విద్యార్థులు 42 వేల మంది, స్మార్ట్‌ఫోన్‌ లేనివారు 65-70 వేలు ఉంటారని లెక్క వేశారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి...

టీవీ లేదా స్మార్ట్‌ఫోన్‌ లేని విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు చేరేందుకు ఈనెల 31లోపు పంచాయతీలు, వార్డు కార్యాలయాలు, ఇతరత్రా భవనాల్లో టీవీ సౌలభ్యం ఉన్నవాటిని గుర్తించాల్సి ఉంది. మేడ్చల్‌ జిల్లాలో 3,827 మంది విద్యార్థులకు టీవీ లేదని గుర్తించి దగ్గర్లో ఉన్న విద్యార్థుల ఇళ్లలోనే పాఠాలు వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈవో విజయకుమారి తెలిపారు. గురువారం జిల్లాలోని ఉపాధ్యాయులతో ఆమె వెబినార్‌ నిర్వహించారు.

* దాదాపు 90 శాతం మంది విద్యార్థుల ఇళ్లలో ఒకే స్మార్ట్‌ఫోన్‌ లేదా తల్లిదండ్రులకు మాత్రమే ఫోన్‌ ఉంది. కాటేదాన్‌, జీడిమెట్ల, పటాన్‌చెరు, మంఖాల్‌, ఆటోనగర్‌లోని పారిశ్రామికవాడల్లో పనిచేసే కార్మికుల పిల్లలకు పాఠాలు చేరడం కష్టంగా మారనుంది.

* ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు తీసుకోని విద్యార్థులు మూడు జిల్లాల్లో 1.80 లక్షల మంది ఉన్నట్లు లెక్క. ఆరో తరగతి పుస్తకాలు ఇంకా పాఠశాలలకే చేరలేదు.

* గాజులరామారం పాఠశాలలో గురువారం కరోనా పరీక్ష కేంద్రం కొనసాగడంతో ఉపాధ్యాయులు విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

మూడు కేటగిరీలుగా సర్వే

1. టీవీ, టీశాట్‌ ప్రసారాలు చూసేందుకు వీలైనవారు

2. స్మార్ట్‌ఫోన్‌, అంతర్జాలం సదుపాయం ఉన్న వారు

3. టీవీ, స్మార్ట్‌ఫోన్‌ లేని విద్యార్థుల గుర్తింపు

ఇదీ చదవండి:'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ABOUT THE AUTHOR

...view details