తెలంగాణ

telangana

ETV Bharat / state

నువ్వలరేవు.. ఈ గ్రామంలో ఎన్నికలు లేవు! - ap news

నువ్వలరేవు.. మత్స్యకారుల గ్రామం. ఇక్కడ గత 70 ఏళ్లలో ఎప్పుడూ పంచాయతీ పోరు జరగకపోవడం విశేషం. ఎన్నికల వేళ స్థానిక బృందావతి ఆలయ ప్రాంగణంలో గ్రామస్థులు సమావేశమై.. రిజర్వేషన్‌కు అనుగుణంగా సర్పంచ్​, ఎంపీటీసీ అభ్యర్థులను నిర్ణయిస్తారు. వారితోనే నామినేషన్‌ వేయిస్తారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందంటే...

నువ్వలరేవు.. ఈ గ్రామంలో ఎన్నికలు లేవు!
నువ్వలరేవు.. ఈ గ్రామంలో ఎన్నికలు లేవు!

By

Published : Feb 3, 2021, 9:46 AM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు (లక్ష్మీదేవిపేట) మత్స్యకారుల గ్రామం. పది వేల జనాభా. సుమారు 5 వేల మంది ఓటర్లు. 14 వార్డులు. సింహభాగం కేవీటీ సామాజికవర్గం వారే. గ్రామస్థులంతా ఏకతాటిపై నిలబడి.. ఒక్కరినే అభ్యర్థిగా నిలబెట్టి.. ఏకగ్రీవంగా ఎన్నికల ప్రక్రియ ముగించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. 70 ఏళ్లలో ఎప్పుడూ పంచాయతీ పోరు జరగకపోవడం విశేషం. ఎన్నికల వేళ స్థానిక బృందావతి ఆలయ ప్రాంగణంలో గ్రామస్థులు సమావేశమై.. రిజర్వేషన్‌కు అనుగుణంగా సర్పంచ్​, ఎంపీటీసీ అభ్యర్థులను నిర్ణయిస్తారు. వారితోనే నామినేషన్‌ వేయిస్తారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు.

నువ్వలరేవు.. ఈ గ్రామంలో ఎన్నికలు లేవు!

‘మా ఊరిలో ఎన్నికలు జరిగి ప్రజలు మద్యం, డబ్బుల పంచడానికి మేం వ్యతిరేకం. ప్రచారానికి ఏ పార్టీ నాయకులూ మా ఊరికిరారు. ఏకగ్రీవం వల్ల వచ్చే ప్రభుత్వ పారితోషికంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్నామని మాజీ ఎంపీటీసీ సభ్యుడు బైనపల్లి వెంకటేశ్‌ తెలిపారు.

ఊరంతా ఒకే మాటపై ఉంటాం. సర్పంచి పదవికి పోటీ పడి కలతలు తెచ్చుకొని మా ఐక్యతను దెబ్బతీసుకోం. సార్వత్రిక, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రమే ఓటు వేస్తాం. బెహరా మధుసూదన్, గ్రామ పెద్ద.

ఇదీ చదవండి:రైతు ఏడిస్తే కేసీఆర్​ తట్టుకోలేరు: ఈటల రాజేందర్​

ABOUT THE AUTHOR

...view details