తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాక్​డౌన్​తో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు' - లాక్ డౌన్​ వల్ల వైద్య సేవలపై ప్రభావం

కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ ​డౌన్​ ప్రకటించగా వైద్య సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండబోదని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. కొవిడ్ టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు.

No effect on medical services
వైద్య సేవలకు అటంకం ఉండదు

By

Published : May 11, 2021, 4:17 PM IST

రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న తరుణంలో వైద్య సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండబోదని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆస్పత్రులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. కరోనా టెస్టులతోపాటు... వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

గ్లోబల్ టెండర్లకు మొగ్గు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సైతం వేగంగా నిర్వహించాలని భావిస్తున్న సర్కారు... గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్​లో నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఆ విధంగానే ముందుకెళ్తున్నాయి. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం ద్వారా అంతర్జాతీయ టీకా తయారీదారుల నుంచి వ్యాక్సిన్​లను సేకరించటం సులభమయ్యే అవకాశం ఉంది.

మరోవైపు లక్షణాలు ఉన్నవారిని ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటికే గుర్తించి ఇంటి వద్దే మందులు ఇస్తున్న తరుణంలో కొవిడ్ లక్షణాలతో టెస్టింగ్ కేంద్రాలకు వచ్చే వారిని ఆపే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి:రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌

ABOUT THE AUTHOR

...view details