తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ అభివృద్ధికి ఏం చేశారు ?: రాకేశ్​ రెడ్డి - తెలంగాణ వార్తలు

వరంగల్​ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదని భాజపా అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరద నగరంగా మార్చారని మండిపడ్డారు. ప్రజలకు సాయం అందించకుండా మోసం చేశారని విమర్శించారు.

no development in warangal city by trs govt says rakesh reddy
వరంగల్​ అభివృద్ధికి ఏం చేశారు ? : రాకేశ్​ రెడ్డి

By

Published : Dec 17, 2020, 6:17 PM IST

వరంగల్​లో వరదలు వస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని భాజపా అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి విమర్శించారు. స్మార్ట్​ సిటీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే రాష్ట్ర వాటా ఇవ్వడం లేదని అన్నారు. నగరాన్ని వరదల్లో ముంచిన ఘనత తెరాసకే దక్కుతుందన్నారు. ప్రజలు వరదలతో తీవ్రంగా నష్టపోతే సాయం కూడా అందించలేని.. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

వరంగల్​, కరీంనగర్​ స్మార్ట్ సిటీ నిధుల విషయంలో అవినీతి జరిగిందని రాకేశ్​రెడ్డి ఆరోపించారు. కేంద్ర నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శిస్తూ కేసీఆర్​ భజన చేయడమే మంత్రుల పని అని ఎద్దేవా చేశారు. వరంగల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

ఇదీ చూడండి:డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా

ABOUT THE AUTHOR

...view details