తెలంగాణ

telangana

ETV Bharat / state

TSCAB No vaccine NO Salary : 'టీకా తీసుకుంటేనే డిసెంబరు నుంచి ఉద్యోగులకు జీతం' - వ్యాక్సిన్​ తీసుకోకపోతే జీతం రాదు

vaccine
vaccine

By

Published : Dec 7, 2021, 3:40 PM IST

Updated : Dec 7, 2021, 4:22 PM IST

15:37 December 07

TSCAB No vaccine NO Salary : 'టీకా తీసుకుంటేనే డిసెంబరు నుంచి ఉద్యోగులకు జీతం'

TSCAB No vaccine NO Salary: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటేనే డిసెంబర్ నెల జీతాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తీసుకున్న ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత కారణాలతో వ్యాక్సిన్ తీసుకోకపోయినట్లయితే దానికి సంబంధించిన పత్రాలు దానిని ధ్రువీకరిస్తూ వైద్యుడు జారీ చేసిన సర్టిఫికేట్‌ సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టెస్కాబ్​లో ఉద్యోగుల కోసం బ్యాంకు ఆవరణలో ఇది వరకే వ్యాక్సినేషన్ డ్రైవ్‌ చేపట్టామని ఆ సంస్థ డైరెక్టర్ నేతి మురళీధర్‌ తెలిపారు. అయినా కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. కరోనా ఎవరిపైనా జాలి చూపదని అలసత్వం వహిస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు డైరెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:Omicron Reinfection: ఒమిక్రాన్​ను జయించిన వైద్యుడికి మళ్లీ కరోనా

Last Updated : Dec 7, 2021, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details