తెలంగాణ

telangana

తెలంగాణలో కరోనా లేదు: ఈటల

By

Published : Mar 10, 2020, 8:53 PM IST

రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అనుమానితులకు నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగిటివ్‌ వచ్చిందని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన 41,102 మంది ప్రయాణికుల్లో 277 మందికి గాంధీలో పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.

no corona positive case in telangana
no corona positive case in telangana

కరోనా వ్యాప్తి దృష్ట్యా విమానాశ్రయం వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. విమానాశ్రయం వద్ద పరీక్షల కోసం వైద్యులు, నర్సులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మరో 2 థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలు కావాలని కేంద్రాన్ని కోరినా... సరైన స్పందన లేకపోవడంతో రెండు స్టాండింగ్‌ థర్మల్‌ స్క్రీన్ల కోసం ఆర్డర్‌ ఇచ్చామని తెలిపారు. కోఠి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు.

తెలంగాణలో కరోనా లేదు: ఈటల

గాంధీ మాదిరిగా ఉస్మానియాలో ల్యాబ్‌కు అనుమతి ఇచ్చినట్లు ఈటల వెల్లడించారు. నమూనాలు పుణెకు పంపకుండా ఇక్కడే పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లాల్లోని బోధన ఆస్పత్రుల్లో పడకలు సిద్ధంగా ఉంచామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details