జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. తాజాగా వెయ్యికిపైగా కొవిడ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. అంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
కంటైన్‌మెంట్ జోన్లు కట్టుదిట్టమైన చర్యలు ఎక్కడా లేవు
గ్రేటర్ హైదరాబాద్లో రెండో దశ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కొవిడ్ బారిన పడుతోన్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వేగంగా వ్యాపిస్తోన్న కరోనా కట్టడి చర్యలను మాత్రం జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. నిన్న జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించినా... బల్దియా వెల్లడించిన ఏరియాల్లో ఎక్కడా కంటైన్‌మెంట్ ఏర్పాటు చేయలేదు. కంటైన్‌మెంట్ జోన్లకు సంబంధించి మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
హైకోర్టు చెప్పినా కంటైన్‌మెంట్ పాటించడం లేదు
హైకోర్టు సూచనల మేరకు ఎక్కడా కూడా కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయలేదు. నిన్న ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించినా... కట్టుదిట్టమైన చర్యలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలకు అవగాహన లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి :'రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి'