తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్సిటీల్లో బయోమెట్రిక్​కు స్వస్తి - no biometric system in universities from next academic year

కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా రానున్న సెమిస్టర్​లో బయోమెట్రిక్ ద్వారా తీసుకునే హాజరుకు స్వస్తి పలకాలని జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. ఫేషియల్‌ టెక్నాలజీ సాంకేతికతపైనా పరిశీలిస్తున్నామని ఓయూ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ సంచాలకుడు ప్రొఫెసర్ సి.వేణుగోపాల్‌రావు తెలిపారు.

no-biometric-system-in-universities-from-next-academic-year
బయోమెట్రిక్​కు స్వస్తి పలికనున్న వర్సిటీలు

By

Published : May 16, 2020, 8:52 AM IST

కరోనా ప్రబలిన నేపథ్యంలో రానున్న సెమిస్టర్‌లో హాజరు విధానంలో మార్పులు తీసుకురావాలని జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీలు నిర్ణయించాయి. బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్రల ద్వారా తీసుకునే హాజరుకు స్వస్తి పలకాలని భావిస్తున్నాయి. విద్యార్థులలో ఎవరికైనా కరోనా ఉంటే ఈ విధానం ద్వారా మిగిలిన వారికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ఆలోచనలో ప్రత్యమ్నాయాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో బయోమెట్రిక్‌ వేలిముద్రల విధానంలో హాజరు తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చని జేఎన్‌టీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ ప్రొ.ఎ.గోవర్ధన్‌ తెలిపారు. ప్రత్యామ్నాయంగా ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు తీసుకునే విషయాన్ని జేఎన్‌టీయూ పరిశీలిస్తోంది. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌(టీఎస్‌టీఎస్‌) సంస్థ అభివృద్ధి చేస్తోంది.

పరిశీలనలో ఫేషియల్ టెక్నాలజీ

అలాగే ఉస్మానియా వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు నిలిపివేయాలని మార్చి 12వ తేదీనే వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొ.గోపాల్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే సెమిస్టర్‌లో ఓయూ పరిధిలో అటెండెన్స్‌ రిజిస్టర్‌ సాయంతో హాజరు తీసుకునే విషయంపై పరిశీలిస్తున్నారు. ఫేషియల్‌ టెక్నాలజీ సాంకేతికతపైనా పరిశీలిస్తున్నామని ఓయూ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ సంచాలకుడు ప్రొ.సి.వేణుగోపాల్‌రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details