తెలంగాణ

telangana

ETV Bharat / state

'మనసుకు ధ్యానం,ఏకాగ్రత ఉంటే చెడు ఆలోచనలు రావు'

థాయిలాండ్ ధ్యాన గురువు వెనెరబెల్ ఆజాన్ హైదరాబాద్​లో పర్యటించారు. అనంతరం​ మహేంద్ర హిల్స్​లోని బుద్ధ విహార్​ను సందర్శించారు.

By

Published : Jul 11, 2019, 10:03 PM IST

సత్యం గురించి లోతుగా కనుక్కోవాలంటే ధ్యానం ద్వారానే సాధ్యం : వెనెరబెల్ ఆజాన్

థాయిలాండ్ నుంచి హైదరాబాద్​కు వచ్చిన ధ్యాన గురువు వెనెరబెల్ ఆజాన్ మహేంద్ర హిల్స్​లోని బుద్ధ విహార్​ను సందర్శించారు. మహేంద్ర హిల్స్​లోని బుద్ధ విహార్​లో తన శిష్యులకు, భక్తులకు ధ్యానం, ఏకాగ్రత గురించి బోధించారు. మనసుకు ధ్యానం, ఏకాగ్రత ఉన్నప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు రావని తెలిపారు.
తాను ధ్యాన గురువుగా ఎదిగిన విధానాన్ని అందరికీ వివరించారు. ప్రస్తుత కాలంలో సత్యం గురించి లోతుగా కనుక్కోవడం, భక్తి భావాన్ని పెంపొందించడం ధ్యానం ద్వారానే సమకూరుతాయన్నారు. ధ్యానానికి సంబంధించి భక్తులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వారితో తన అనుభవాన్ని పంచుకున్నారు.

మనసుకు ధ్యానం, ఏకాగ్రత ఉన్నప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు రావు : వెనెరబెల్ ఆజాన్

ABOUT THE AUTHOR

...view details